హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచి బరిలో 104 మంది

ASR: డుంబ్రిగుడ మండలంలోని 18 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 104 మంది బరిలో నిలిచారని రిటర్నింగ్ అధికారి రహీం తెలిపారు. నామపత్రాల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియలు ముగిశాయన్నారు. 55 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగతా చోట్ల పోటీలో ఉన్న 368 మందికి గుర్తులు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు.