హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్యాంపస్ సెలక్షన్స్‌లో 36 మంది BITS విద్యార్థులకు ఉద్యోగాలు

అన్నమయ్య: రామాపురం మండలం బండపల్లిలోని BITS కళాశాలలో CII ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్‌లో 36 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని కళాశాల ఛైర్మన్ భాస్కర్ తెలిపారు. ఎంపికైన విద్యార్థులను యాజమాన్యం అభినందించింది.