హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లా బేస్ బాల్ జట్టు ఎంపికలు

GNTR: కొర్రపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇవాళ గుంటూరు జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి కడియం జయరావు తెలిపారు. 2009 తర్వాత జన్మించిన క్రీడాకారులు అర్హులని తెలిపారు. వయసు ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో హాజరుకావాలని సూచించారు. మరింత సమాచారం కోసం 9959164809 నంబరులో సంప్రదించాలని కోరారు.