హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విధులకు గైర్హాజరు.. 172 మంది సిబ్బందిపై చర్యలు: కలెక్టర్

కడప: మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ విధులకు గైర్హాజరైన 172 మంది ప్రిసైడింగ్, ఇతర పోలింగ్ అధికారులపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించాలని కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. ఎలాంటి అనుమతి లేకుండా విధులకు రాని సిబ్బందిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.