హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి

E.G: రాజమండ్రి ఐఎల్‌టీడీ బ్రిడ్జి సమీపంలోని రైల్వే ట్రాక్‌పై 12861 ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్‌ఐ ఎం. వెంకటేశ్వరరావు శుక్రవారం తెలిపారు. మృతురాలి వయస్సు సుమారు 30 ఏళ్లు, ఎత్తు 5.2 అడుగులుగా ఉంటుందని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మహిళ ఆచూకీ తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని కోరారు.