హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాడపల్లి ఆలయంలో ఘనంగా తొలి హారతి

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం తొలి హారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సన్నిధిలో నిత్యం నిర్వహించే శ్రీ వెంకటేశ్వర సహిత ఐశ్వర్య లక్ష్మీ హోమాన్ని వైభవంగా జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.