హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమలాపురం అభివృద్ధికి సమష్టి కృషి చేయాలి: చైర్మన్ నల్లా శ్రీధర్

కోనసీమ: అమలాపురం పట్టణ అభివృద్ధికి పార్టీలకతీతంగా కౌన్సిలర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మున్సిపల్ ఛైర్మన్ నల్లా శ్రీధర్ పిలుపునిచ్చారు. నూతన పాలకవర్గ తొలి కౌన్సిల్ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, భక్తుల సౌకర్యాల కల్పనకు సంబంధించి రూ.11.43 లక్షలకు పైగా విలువైన ప్రతిపాదనలకు సమావేశంలో ఆమోదం తెలిపారు.