హైదరాబాద్: 28°C
వ్యాపారం

టాటా ట్రస్టులకు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ

బాంబే హైకోర్టులో టాటా ట్రస్టులకు చుక్కెదురైంది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా చంద్రశేఖరన్‌ను పునర్నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై తక్షణ జోక్యానికి కోర్టు నిరాకరించింది. టాటా సన్స్ సమావేశాన్ని వాయిదా వేయడం, లేదా ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ హోదాలో చంద్రశేఖరన్ ఓటు వేయకుండా నిలువరించాలన్న ఆదేశాలపై ఊరట కల్పించలేమని తెలిపింది. షెడ్యూల్ ప్రకారమే బోర్డు సమావేశం నిర్వహించాలని స్పష్టం చేసింది.