అందుబాటు గృహాల ధర పరిమితిని ప్రస్తుత రూ.45 లక్షల నుంచి రూ.90 లక్షలకు పెంచాలని రియల్టర్ల సమాఖ్య క్రెడాయ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ధర పరిమితితో పాటు కార్పెట్ ఏరియా నిబంధనలను కూడా సవరించాలని సూచించింది. ఈ మార్పులతో తక్కువ ధర ఇళ్లకు డిమాండ్ పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 2027-28 కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి సమర్పించిన ప్రతిపాదనల్లో ఈ డిమాండ్‌ను ప్రస్తావించింది.
వ్యాపారం
పరిమితిని ₹90 లక్షలకు పెంచండి: క్రెడాయ్


