హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైస్ కంపెనీలపై అధికారుల దాడులు

నెల్లూరు పెద్దబజార్‌లోని డైకస్ రోడ్డులో ఉన్న ఓ రైస్ కంపెనీపై విజిలెన్స్, పౌర సరఫరాల అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా వ్యాపారం చేయడంతో పాటు స్టాక్ వివరాలు నమోదు చేయకపోవడాన్ని గుర్తించారు. దీంతో 1,901 బస్తాల (555.24 క్వింటాళ్ల) బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.42.30 లక్షలుగా అధికారులు వెల్లడించారు.