హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామాల్లో పోలీసులు రూట్ మార్చ్

VSP: పెందుర్తి మండల పరిధిలోని వాలిమేరక జుత్తాడా గ్రామాల్లో పెందుర్తి పోలీసులు శుక్రవారం సాయంత్రం రూట్ మార్చ్ నిర్వహించారు. సిఐ సతీష్ కుమార్ పరివేక్షణలో ఎస్సైలు సిబ్బంది కవాతు నిర్వహించి గ్రామస్తులకు ముందస్తు భద్రత సూచనలు చేశారు. వివాదాలకు తల దూర్చవద్దని హెచ్చరించారు. సమస్య ఎదురైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.