MHBD: కురవి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న 10 క్వింటాళ్ల పటిక, 2 క్వింటాళ్ల నల్లబెల్లం, 20 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం అయ్యగారిపల్లి సమీపంలో మహీంద్రా జైలో వాహనాన్ని పట్టుకుని, డ్రైవర్ బనోత్ ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన సరుకు విలువ రూ.54 వేలు ఉంటుందన్నారు.
తెలంగాణ
నాటుసారా, బెల్లం పట్టివేత


