హైదరాబాద్: 28°C
తెలంగాణ

36 తులాల బంగారం చోరీ కేసు ఛేదన

RR: వనస్థలిపురం కమలానగర్‌లో ఇంటి తాళం పగులగొట్టి 36 తులాల బంగారం చోరీ చేసిన కేసును వనస్థలిపురం, సీసీఎస్ ఎల్బీనగర్ పోలీసులు ఛేదించారు. పాత నేరస్థుడు బత్తుల రవీందర్‌తో పాటు చోరీ సొత్తు కొనుగోలు చేసిన నేనావత్ కృష్ణను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి బంగారం, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.