VKB: చింతకుంట గ్రామానికి చెందిన జోగురాజు, బాను చంద్రులు రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు సమాచారం. వికారాబాద్ నుంచి గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలోని లోతు వాగు దాటిన తర్వాత కల్వర్టు వద్ద ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, క్షతగాత్రులను అంబులెన్స్‌లో వికారాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణ
కల్వర్టు వద్ద ప్రమాదం.. ఇద్దరికి గాయాలు


