హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరుసగా మూడో ఏడాది ఎంపిక

PPM: నర్సీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని నగిరెడ్డి హారిక వరుసగా మూడో ఏడాది జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికై అరుదైన ఘనత సాధించింది. ఆమె విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బోను సత్యనారాయణ, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నల్లా బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం పాఠశాలలో హారికను అభినందించారు.