VSP: విమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలోని రహదారిని అరిలోవ-డెయిరీఫామ్ జంక్షన్ మధ్య ప్రత్యామ్నాయ మార్గంగా వాడవద్దని డైరెక్టర్ డాక్టర్ మన్మథరావు సూచించారు. బయటి వాహనాల అతివేగం, రాంగ్ రూట్ వల్ల అంబులెన్సులకు ఆటంకం, రోగులకు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఆసుపత్రిలోకి రోగులు, సిబ్బంది వాహనాలకు మాత్రమే అనుమతి ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఆసుపత్రి రహదారిని ప్రైవేటు రహదారిగా వాడుకోవద్దు'


