SRCL: బోయినపల్లి మండలం కొదురుపాకలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ గడ్డం నరేష్ శుక్రవారం తనిఖీ చేశారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని, నిబంధనల ప్రకారం తేమ శాతం ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు.
తెలంగాణ
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్


