హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూముల రీ సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్

SRCL: బోయినపల్లి మండలం మల్లాపూర్, వరదవెల్లి గ్రామాల్లో కొనసాగుతున్న భూముల రీ సర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ గడ్డం నరేష్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులకు ముందస్తు సమాచారం అందించి, వారి సమక్షంలోనే సర్వే నిర్వహించి భూముల వివరాలను నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ షరీఫోద్దీన్, సర్వే అధికారులు పాల్గొన్నారు.