హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెబల్స్ తరఫున ప్రచారం.. టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

సత్యసాయి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు లేపాక్షికి చెందిన టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు బి. గోవిందప్ప, తెలుగు యువత మండల అధ్యక్షుడు నరసింహమూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఎమ్మెల్యే కార్యాలయం ప్రకటించింది. రెబల్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసినా, మద్దతు తెలిపినా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.