హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు బాలల రక్షణ చట్టాలపై అవగాహన

ప్రకాశం: గిద్దలూరులోని నారాయణ పాఠశాలలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ. ఓంకార్ ఆధ్వర్యంలో సురక్షిత బాల్యం–బాలల రక్షణ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పోక్సో, బాల్య వివాహాల నిరోధక, మత్తు పదార్థాల నిరోధక చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాలలు సమస్యలు ఎదురైతే 1098, 112, న్యాయ సహాయం కోసం 15100 నంబర్లను సంప్రదించాలని సూచించారు.