హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉన్నత లక్ష్యాలతో ఎదగాలి: సీఐ

MDCL: ఏదులాబాద్‌లోని మేఘా ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ పి.కిరణ్ మాట్లాడుతూ యువత మత్తుకు బానిసైతే దేశ భవిష్యత్తు, సమాజ ప్రగతి దెబ్బతింటాయని అన్నారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, చట్టపరమైన చర్యలను వివరించి, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.