హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్‌ను సత్కరించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి

PLD: నాదెండ్ల (M) గోరిజవోలు గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన వేముల రామ్మోహనరావు మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావును మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ అజెండా అని పుల్లారావు పేర్కొంటూ ఆయన్ను దుశ్శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరి సదాశివరావు, కందుల రమణ, పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు.