హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ ప్రవేశం వివాదంపై డీజీపీకి ఫిర్యాదు

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఆలయ ప్రవేశం పేరుతో దళిత కుటుంబాన్ని అవమానించారని బాధితుడు మాసాని సుధీర్ ఆరోపించారు. ఘటనపై ఫిర్యాదు చేసి 45 రోజులు గడిచినా నిందితులను అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో డీజీపీ, మానవ హక్కుల కమిషన్‌ను కలిసి న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.