హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి: ఉషశ్రీ

సత్యసాయి: గోరంట్ల మండలం బూదిలి పంచాయతీలో శుక్రవారం వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. స్థానికంగా ఉన్న తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం తదితర సమస్యలపై చర్చించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజల పక్షాన నిలబడుతూ, గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.