HYD: శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో చార్మినార్, మక్కా మసీదు పరిసరాల్లో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ క్షేత్రస్థాయిలో పర్యటించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పోలీసుల మోహరింపు, CCTV నిఘా, ట్రాఫిక్ నియంత్రణపై సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్తో పాటు అధికారులకు సూచించారు.
తెలంగాణ
చార్మినార్ వద్ద పోలీసుల భారీ భద్రత


