హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాపును చూసి బలుపు అనుకోవద్దు: ఎమ్మెల్యే

ATP: రాప్తాడు నియోజకవర్గ 96 పంచాయతీల్లో 52 టీడీపీ, ఒక జనసేన స్థానం గెలిచాయని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. అక్రమాల ఆరోపణలను తోసిపుచ్చారు. రెబల్ అభ్యర్థులతో ఓట్లు చీలి కొన్ని చోట్ల స్వల్ప తేడాతో ఓడామన్నారు. కూటమి 13,252 మెజారిటీ సాధించగా, వైసీపీ మెజారిటీ 9,831 ఓట్లకే పరిమితమైందని వివరించారు. వాపును చూసి బలుపు అనుకోవద్దని హితవు పలికారు.