హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన

NDL: ఆత్మకూరు మండలం అమలాపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం-2లో బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై కలిగే ప్రభావాలను వివరించారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, బాలికలకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు.