హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నాయకుడు అకస్మాత్తుగా మృతి

NDL: బనగానపల్లె పట్టణంలోని మంగళవారం పేటలో శుక్రవారం వైసీపీ నాయకుడు గౌస్ మొహద్దిన్ అకస్మాత్తుగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గౌస్ మొహద్దీన్ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు మాజీ ఎమ్మెల్యే తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.