హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

AKP: మాడుగుల శివయ్య, విజ్ఞాన పబ్లిక్ స్కూల్‌లలో శుక్రవారం విద్యార్థులకు పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జూనియర్ సివిల్ జడ్జి ఇంఛార్జ్ బి. సూర్యకళ చట్టంలోని ముఖ్యాంశాలను వివరించారు. సీనియర్ న్యాయవాది మరుపిళ్ల కృష్ణమోహన్ పాత్రుడు, న్యాయవాది పైలా కొండలరావు బాలలపై లైంగిక వేధింపులు, మంచి స్పర్శ–చెడు స్పర్శపై అవగాహన కల్పించారు.