హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సింహాచలం ఆలయంలో రామచంద్ర జీయర్ స్వామి

VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామివారిని శుక్రవారం త్రిదండి శ్రీమన్నారాయణ రామచంద్ర జీయర్ స్వామివారు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, సహాయ కార్యనిర్వహణాధికారి పాలూరి నర్సింగరావు ఆలయ మర్యాదలతో స్వామీజీకి స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు.