BHPL: జిల్లాలోని మేడిపల్లి, మహాదేవపూర్, కాలేశ్వరంలోని గిరిజన సంక్షేమ పాఠశాలలను జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నాగసాగర్ శుక్రవారం తనిఖీ చేశారు. విద్యాబోధన, వసతులు, భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలని, పరిశుభ్రత పాటిస్తూ హాజరు శాతం పెంచాలని ఉపాధ్యాయులు, వార్డెన్లకు సూచించారు.
తెలంగాణ
గిరిజన పాఠశాలల్లో డీటీడీవో తనిఖీలు


