హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నప్రసాద వితరణకు రూ.62 వేల విరాళం

NGKL: నాగర్‌ కర్నూల్ పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి దేవాలయంలో మండల దీక్షల సందర్భంగా కొనసాగుతున్న అన్నదాన కార్యక్రమానికి న్యూ పాఠశాల సన్నిధానం అయ్యప్ప స్వాములు శుక్రవారం రూ.62,000 విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. భక్తులకు అన్నప్రసాదం అందించడం గొప్ప సేవ అని గురు స్వాములు కందూరు తిరుపతయ్య, కంచుకట్ల రవి పేర్కొన్నారు.