హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ సర్టిఫికెట్లు

RR: గచ్చిబౌలి డివిజన్ టెలీకాంనగర్‌లోని అక్షయ దాగా స్కిల్ సెంటర్‌లో మూడు నెలల కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు శుక్రవారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అక్షయ శక్తి వెల్ఫేర్ అసోసియేషన్, టెలీకాంనగర్ ఆర్‌డబ్ల్యూఏ, శ్రీ సత్యసాయి సేవా సన్నిధి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా హాజరయ్యారు.