హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దూపాడు ట్యాంకును పరిశీలించిన కలెక్టర్

ప్రకాశం: త్రిపురాంతకం మండలం దూపాడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును జిల్లా కలెక్టర్ విజయసునీత శుక్రవారం పరిశీలించారు. నాగార్జునసాగర్ కుడి కాలువ నీటితో మూడు రోజుల్లో ట్యాంకును పూర్తిస్థాయిలో నింపాలని అధికారులను ఆదేశించారు. చెరువు కట్టలకు నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి వృథాను అరికట్టాలని సూచించారు.