హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్

బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్.. జెమీ ఓవర్టన్(5W) ధాటికి 108 పరుగులకే కుప్పకూలింది. వర్షం కారణంగా DLS పద్ధతిలో లక్ష్యాన్ని 16 ఓవర్లలో 93 పరుగులకు కుదించారు. ఈ టార్గెట్‌ను ఇంగ్లండ్ 8.5 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో ఇంగ్లండ్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.