KRNL: కౌతాళం మండలం ఉరుకుంద ఈరన్న స్వామి దేవస్థానంలో ఆలయ ఈఓ కె.వాణి ఆధ్వర్యంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో మొత్తం రూ.1,24,12,708 ఆదాయం లభించింది. ఇందులో సాధారణ హుండీ ద్వారా రూ.1,16,06,428, అన్నదాన హుండీ ద్వారా రూ.8,06,280 సమకూరాయి. వీటితో పాటు 30 గ్రాముల 60 మిల్లీగ్రాముల బంగారం, 12 కిలోల 900 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ లభించాయి.
ఆంధ్రప్రదేశ్
ఈరన్న స్వామి హుండీ ఆదాయం రూ.1.24 కోట్లు


