హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో భక్త కనకదాసు జయంతి

TPT: RTC బస్టాండ్ సమీపంలోని కనకదాసు విగ్రహం వద్ద కురువ, కురుబ సంఘం ఆధ్వర్యంలో 539వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహాన్ని పూలతో అలంకరించి, గజమాలతో ఘనంగా నివాళులర్పించారు. మంత్రి సవితమ్మ సహకారంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రెడ్డప్ప తెలిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.