ASR: కొయ్యూరు మండలం వైఎన్ పాకలు ఆశ్రమ పాఠశాలను శుక్రవారం స్కూల్ ఛైర్మన్ సమిరెడ్డి విజయ్, వైస్ ఛైర్మన్ కుమారి సందర్శించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలు, భోజన వసతులపై ఆరా తీశారు. భోజన మెనూను సక్రమంగా అమలు చేయాలని వార్డెన్‌కు సూచించారు. అనంతరం వంటశాల, స్టోర్ రూమ్‌లోని సరుకుల నిల్వలను పరిశీలించారు. విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలలో విద్యార్థినుల సమస్యల పరిశీలన


