హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

YCP మద్దతుదారులను గెలిపించండి: మాజీ ఎమ్మెల్యే

E.G: మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి గ్రామపంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఈ మేరకు వీడియో విడుదల చేశారు. అనపర్తి, దుప్పలపూడి తదితర ప్రాంతాల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలు గుర్తించాలని కోరారు. గ్రామాల అభివృద్ధి కోసం వైసీపీ మద్దతుదారులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.