హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుగ్గలి, రాంపల్లి సర్పంచుల ఏకగ్రీవం

KRNL: తుగ్గలి మండలంలోని తుగ్గలి, రాంపల్లి గ్రామాల సర్పంచులుగా సాయి చంద్రిక, జానకమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో శుక్రవారం వారి ఎన్నిక ఖరారైంది. తుగ్గలి గ్రామంలో తుగ్గలి నాగేంద్ర కుమార్తె సాయి చంద్రిక, రాంపల్లి గ్రామంలో జానకమ్మ సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయా గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.