హైదరాబాద్: 28°C
క్రీడలు

సొంతగడ్డపై ఆస్ట్రేలియా చెత్త రికార్డ్

ఆస్ట్రేలియా సొంతగడ్డపై చెత్త రికార్డు నమోదు చేసింది. గబ్బా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో ఆసీస్ 108 పరుగులకే ఆలౌటైంది. జెమీ ఓవర్టన్ 5 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాకు ఇదే అత్యల్ప టీ20 స్కోరు. గతంలో సిడ్నీలో న్యూజిలాండ్‌పై చేసిన 111 పరుగుల చెత్త రికార్డు ఈ మ్యాచ్‌తో బద్దలైంది.