హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

MNCL: హాజీపూర్ మండలంలోని గడ్పూర్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ రామగిరి బానేష్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు దళారులకు పంట అమ్మి నష్టపోకుండా కొనుగోలు కేంద్రంలో విక్రయించి లబ్ధి పొందాలని సూచించారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లింగయ్య, గ్రామ సర్పంచ్ స్వప్న పాల్గొన్నారు.