హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సింహాచలం అప్పన్న ధ్వజస్తంభం స్వర్ణమయం

విశాఖ: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి ఆలయ ధ్వజస్తంభ పీఠానికి ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ స్వర్ణ తాపడం సమర్పించారు. సుమారు 509.600 గ్రాముల బంగారం (రూ.1.20 కోట్ల)తో పీఠానికి స్వర్ణ తాపడం చేయించారు. తాపడం పూర్తికావడంతో అర్చకులు ప్రత్యేక పూజలు, సంప్రోక్షణ నిర్వహించారు.