హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏకగ్రీవ సర్పంచ్‌లను సత్కరించిన ఎమ్మెల్యే శ్రావణి

ATP: పుట్లూరు మండలం దోసలేడు, బాలాపురం, సి. వెంగణపల్లి, కందికాపుల గ్రామ పంచాయతీల్లో కూటమి మద్దతుతో సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన సర్పంచులు, వార్డు సభ్యులు తనను మర్యాదపూర్వకంగా కలవగా శాలువాలతో సత్కరించి అభినందించినట్లు ఎమ్మెల్యే బండారు శ్రావణి తెలిపారు. గ్రామాల అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని సూచించారు.