కర్నూలు జిల్లాలో రబీ 2026–27 సీజన్‌కు అర్హులైన రైతులు డిసెంబర్ మొదటి వారంలోపు పంటల బీమా నమోదు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సూచించారు. పప్పుశనగ, వేరుశనగ, జొన్న, ఉల్లి, వరి, ఎంపిక చేసిన మండలాల్లో టమాటా పంటలకు PMFBY కింద బీమా సదుపాయం ఉందన్నారు. రైతులు క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ద్వారా ఇంటి నుంచే ఉచితంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'బీమా నమోదు గడువు డిసెంబర్ మొదటి వారం'


