KDP: రాజంపేట పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో చలితీవ్రత పెరిగి దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ఉదయం 7 గంటల వరకు మంచు తగ్గకపోవడంతో కడప–తిరుపతి ప్రధాన రహదారిపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజంపేటను కమ్మేసిన దట్టమైన పొగమంచు


