అన్నమయ్య: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన సదుం మండలంలో జరిగింది. గుండ్లూరు వారి పల్లికి చెందిన నవీన్ (27), మిథున్ బైక్పై గురువారం రాత్రి వస్తుండగా జాండ్రపేట వంతెన వద్ద బ్రిడ్జి రక్షణ గోడను ఢీకొన్నారు. వారు అదుపుతప్పి బ్రిడ్జి అవతల ఉన్న సర్వీస్ రోడ్డు పైకి పడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించగా నవీన్ మృతి చెందాడు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి


