హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యాగంటిలో పర్యటించిన బీసీ ఇందిరమ్మ

NDL: బనగానపల్లె (మం) యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో శుక్రవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు అర్చకులు కలిసి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆమె ఉమామహేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలను అందజేశారు.