హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

21వ డివిజన్ అభివృద్ధిపై సమీక్ష

నెల్లూరులోని 21వ డివిజన్‌లో అడిషనల్ కమిషనర్ కె. హిమబిందు సచివాలయ సిబ్బందితో అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ విజయలక్ష్మి గునుకుల డ్రైనేజీ, రోడ్ల మరమ్మతులు, కాలువల నిర్మాణం, పారిశుద్ధ్య సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించి డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు.