హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒంటిమిట్టలో ఆరు గ్రామాల సర్పంచులుగా వీరు ఎన్నిక

KDP: ఒంటిమిట్ట మండల పరిధిలోని ఆరు గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కొత్త మాధవరం నుంచి బొడిచర్ల శ్రీనివాసులు, నరవకాటపల్లి నుంచి గంగిపోగు శివయ్య, గొల్లపల్లి నుంచి తప్పెట సుస్మిత, కోనరాజుపల్లి నుంచి అన పుల్లయ్య, సాలాబాద్ నుంచి చంద్రశేఖర్ రెడ్డి, రాచగుడిపల్లి నుంచి పండేటి దీప సర్పంచులుగా ఎన్నికయ్యారు.